టర్కీలో భారీ భూకంపం.. 560 మంది మృతి!

by Disha Web |
టర్కీలో భారీ భూకంపం.. 560 మంది మృతి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం తీరని విషాదాన్ని మిగిల్చింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపం ధాటికి ఈ రెండు దేశాల్లో 560 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. టర్కీలోని నుర్దగికి 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇవాళ తెల్లవారు జామున వరుసగా భూమి కంపించడంతో భారీ భవనాలు నేలకూలాయి. భయాందోళనలతో ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. ఈ క్రమంలో అనేక మంది భవనాల్లోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంతుచిక్కని ఈ విషాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు చింతిస్తున్నాంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పిన మోడీ ఈ కష్ట సమయంలో టర్కీ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందన్నారు. అన్ని విధాలుగా ఆదుకునేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు.
Next Story