సంచలనం: తాజ్​ హోటళ్లలో వ్యభిచారం.. రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డ హీరోయిన్స్​

by Disha Web Desk 7 |
సంచలనం: తాజ్​ హోటళ్లలో వ్యభిచారం.. రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డ హీరోయిన్స్​
X

దిశ, వెబ్​డెస్క్ : చుట్టూ అందాల ప్రపంచం.. లగ్జరీ లైఫ్​.. కావాల్సినంత స్టార్​ డమ్​.. అయినా ఓ ఇద్దరు హీరోయిన్లు అడ్డదారులు తొక్కారు. రాష్ట్రాలు దాటి వచ్చి మరీ వ్యభిచారానికి తెరలేపారు. మధ్య వర్తులతో కలిసి విలాసవంతైన హోటళ్లలో విటులతో ఎంజాయ్​ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ముంబై, బెంగాల్​కు చెందిన ఇద్దరు హీరోయిన్లు హైదరాబాద్​లోని తాజ్​ హోటళ్లలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగాలీకి చెందిన టీవీ సీరియల్స్​కు చెందిన ప్రముఖ హీరోయిన్​, ముంబైకి చెందిన ప్రముఖ నటి ఇద్దరు హైదరాబాద్​లోని తాజ్​ డెక్కన్​, తాజ్​ బంజారా హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులకు సమాచారం అందింది. రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు మొదట తాజ్​ డెక్కన్​ హోటల్​పై దాడి చేయగా.. ముంబై నటి వ్యభిచారం చేస్తూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడింది. ఆమెతోపాటు బ్రోకర్​గా వ్యవహరిస్తున్న మోనిష్​ కడాకియాను కస్టడిలోకి తీసుకున్నారు.

మరో బృందం తాజ్​ బంజారా హోటల్​పై దాడి చేసి రూం నంబర్​ 402లో వ్యభిచారం చేస్తున్న బెంగాలీ హీరోయిన్​, విటుడు వెంకటేశ్వర్​ రావుని అదుపులోకి తీసుకున్నారు. వీరికి బ్రోకర్​గా వ్యవహరించిన జనార్ధన్​ పరారీ అయ్యాడు. అదుపులోకి తీసుకున్న వారందరినీ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. నటీమణులపై కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పంజాగుట్ట సీఐ రవీందర్​ రావు మీడియాకు వెల్లడించారు. కాగా, ఇంత విలాసవంతమైన హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తుండటం పట్ల పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతైన విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

Also Read: 12 గంటలపాటు సెక్స్.. పిల్లలకోసం తప్పలేదన్న పోర్న్ స్టార్



Next Story