గ‌డ్డి ట్రాక్ట‌ర్ ఢీ.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

by Nallavelli.Anjaneyulu |

గడ్డి ట్రాక్ట‌ర్ ఢీ కొని బైకు పై ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన సంఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ‌లం సింగోటం ల‌క్ష్మీదేవ‌మ్మ గుట్ట స‌మీపంలో చోటు చేసుకుంది.

గ‌డ్డి ట్రాక్ట‌ర్ ఢీ.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం
X

దిశ‌, కొల్లాపూర్ : గడ్డి ట్రాక్ట‌ర్ ఢీ కొని బైకు పై ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన సంఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ‌లం సింగోటం ల‌క్ష్మీదేవ‌మ్మ గుట్ట స‌మీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని చుక్కాయ‌ప‌ల్లి గ్రామానికి చెందిన బింగి ఊష‌న్న యాద‌వ్ (58) గొర్రెల వ్యాపారం చేస్తుంటాడు. ఇత‌నితో పాటు కొల్లాపూర్ ప‌ట్ట‌ణానికి చెందిన స‌మ్మ‌ద్ (40) క‌లిసి వ‌న‌ప‌ర్తికి గురువారం బైకుపై వెళ్లారు. తిరుగు ప్ర‌యాణంలో కొల్లాపూర్ మండ‌లం సింగోటం గ్రామ స‌మీపంలోని ల‌క్ష్మీదేవ‌మ్మ గుట్ట రోడ్డు మ‌లుపు వ‌ద్ద‌కు వీరి బైకు రాగానే ఎదురుగా గ‌డ్డి లోడ్ తో వెళ్తున్న ట్రాక్ట‌ర్ వీరి బైకు ని ఢీ కొట్టింది. దీంతో వీరిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ట్రాక్ట‌ర్ సింగోటం గ్రామం దాటి ప‌రార్ అయ్యారు. గ్రామ‌స్తులు వెంటాడి ప‌ట్టుకున్న‌ట్టు స‌మాచారం. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు మృతదేహాల‌ను పోస్టు మార్టం కోసం కొల్లాపూర్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story