Flight Crash: ప్యాసింజర్ ఫ్లైట్‌ను ఢీకొట్టిన హెలికాప్టర్.. 64 మంది దుర్మరణం (వీడియో వైరల్)

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-30 15:24:26  IST  )

విమానం కుప్పకూలిన ఘటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (United State Of America)లో అక్కడి కాలమానం ప్రకారం బుధవారం 8 గంటల సమయంలో చోటుచేసుకుంది.

Flight Crash: ప్యాసింజర్ ఫ్లైట్‌ను ఢీకొట్టిన హెలికాప్టర్.. 64 మంది దుర్మరణం (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: విమానం కుప్పకూలిన ఘటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (United State Of America)లో అక్కడి కాలమానం ప్రకారం బుధవారం 8 గంటల సమయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వర్జీనియా (Virginia) రాష్ట్రంలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయానికి (Ronald Reagan Washington National Airport) సిబ్బందితో కలిపి 64 మందితో ఓ విమానం ల్యాండ్ అవుతోంది. ఇదే సమయంలో ఫ్లైట్ పోటోమాక్ నది (Potomac River) సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ మిలటరీ హెలికాప్టర్ (Military Helicopter) ఆ ప్యాసింజర్ ఫ్లైట్‌ (Passenger Flight)ను బలంగా ఢీకొట్టింది. దీంతో విమాన శకలాలు పొటోమాక్ నదిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దుర్ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న 64 మంది ప్రాణాలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు (Ronald Reagan Airport) ల్యాండింగ్‌ ట్రాక్‌కు సమీపంలోనే విమానం కూలిపోయిందని అధికారిక వర్గాలు కూడా ధృవీకరించాయి.

ఈ మేరకు వాషింగ్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ (Washington Fire Department) ఫైర్ బోట్లతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతోంది. ఈ ప్రమాదం కారణంగా రీగన్ నేషనల్‌ పరిధిలోని అన్ని విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే, విమానం కూలిపోవడానికి గల కారణాలేంటనే విషయం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అదేవిధంగా రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్ నుంచి అన్ని విమానాల టేకాఫ్స్ (Take Offs), ల్యాండింగ్స్‌ (Landings)‌ను పూర్తి నిలిపివేశారు. ఎయిర్‌ ఫీల్డ్‌ (Air Field) విమానం కూలిన ఘటనపై ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే, ఫ్లైట్ యాక్సిడెంట్‌కు సంబంధించి ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Next Story