దొరికిపోతానేమోనని జైల్లో మొబైల్ మింగిన ఖైదీ

by Dishafeatures2 |
దొరికిపోతానేమోనని జైల్లో మొబైల్ మింగిన ఖైదీ
X

దిశ, వెబ్ డెస్క్: జైలు వార్డర్ల కన్నుగప్పి ఓ ఖైదీ జైలులో సెల్ ఫోన్ వాడుతున్నాడు. తాజాగా జైలు అధికారులు తనిఖీ నిర్వహించగా దొరికిపోతానేమోనన్న భయంతో ఆ ఖైదీ మొబైల్ ఫోన్ ను మింగాడు. ఈ ఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లా కేంద్రంలోని జైలులో చోటు చేసుకుంది. గోపాల్ గంజ్ జైల్ సూపరిండెంట్ మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కైషర్ అలీ అనే ఖైదీ డ్రగ్స్ కేసులో మూడేళ్లుగా గోపాల్ గంజ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అలీ జైలు అధికారుల కళ్లు గప్పి సెల్ ఫోన్ మెయింటెన్ చేస్తున్నాడు. కాగా ఈ నెల 18న ఖైదీలు ఉండే బ్యారక్ లో జైలు అధికారులు తనిఖీ చేపట్టారు. దీంతో దొరికిపోతానేమోననే భయంతో కైషర్ అలీ తన ఫోన్ ను మింగేశాడు.

కాగా.. మరుసటి రోజు అలీకి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. కడుపునొప్పి తాళలేక అలీ జైలు అధికారులకు జరిగిందంతా చెప్పేశాడు. దీంతో జైలు అధికారులు ఆ ఖైదీని వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎక్స్ రే పరీక్షలో అతడి కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ సలామ్ సిద్ధిఖీ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆ ఖైదీని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జైలు శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో జైలులో సెక్యూరిటీ లోపంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Next Story

Most Viewed