చెడువ్యసనాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు.. నిందితుల అరెస్ట్

by Disha Web Desk 11 |
చెడువ్యసనాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు.. నిందితుల అరెస్ట్
X

దిశ, దుందిగల్: చెడు వ్యసనాలకు అలవాటు పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాతనేరస్తునితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన దుందిగల్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. దుందిగల్ డిటెక్టీవ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ప్రసాద్ పోలీస్ స్టేషన్ లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా తాండూరు గ్రామం, అంబేద్కర్ కాలానికి చెందిన కొనపులి కిరణ్ తేజా (19), ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ గండిమైసమ్మ చౌరస్తాలోని అయ్యప్ప హాస్టల్ ఉంటున్నాడు. మేడ్చల్ జిల్లా, దుందిగల్ తండా-1 కు చెందిన మేఘవత్ సాయి నాయక్(23) డి.పోచంపల్లి ఇందిరానగర్ లో ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ వీరిద్దరూ ఈజీ మని కోసం హాస్టల్ లోని సెల్ ఫోన్ లను, రద్దీ ప్రదేశాలలో పార్క్ చేసిన ద్విచక్రవాహనాలను దొంగిలించి వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారు.

ఈ నెల 21 న రాత్రి 9 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పెట్రోలింగ్ పోలీస్ లు ఫింగర్ ప్రింట్ స్కానర్ పాపిలోన్ ద్వారా చెకింగ్ చేయడంతో కొనుపల్లి కిరణ్ తేజా 275/2023 అండర్ సెక్షన్ 379 ఐపీసీ గా గతంలో పాత నేరస్తుడుగా తేలడంతో అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన దొంగతనాల గురించి ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి యూనికాన్ ద్విచక్రవాహనంతోపాటు, 5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పాపిలోన్ డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఆధారంగానే నిందితులను గుర్తించామని, రిమాండ్ కు తరలిస్తున్నట్లు కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దుందిగల్ సిఐ వై.రామకృష్ణ, డిటెక్టీవ్ సబ్ ఇన్ స్పెక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed