కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతిరోజు దేశంలో బాంబుల మోతే… : రఘునందన్ రావు

by Disha Web Desk 11 |
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతిరోజు దేశంలో బాంబుల మోతే… : రఘునందన్ రావు
X

దిశ , కొల్చారం: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజలకు భద్రత కరువవుతుందని, ప్రతిరోజు దేశంలో బాంబుల మోతే వినిపిస్తుంది అని బిజెపి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. శనివారం మండలంలోని దుంపలకుంట, రంగంపేట, చిన్న ఘనపూర్, పోతంశెట్టిపల్లి, అప్పాజీపల్లి కొల్చారం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో కొల్చారం గ్రామంలో కార్నర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో భద్రత కరువవుతుందని, దేశంలో దేశద్రోహులు పెరిగిపోతారన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రుణాలు చెల్లించొద్దు అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మారుస్తూ రుణమాఫీని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ దేవుళ్లపై ఓట్లు వేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాడన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రంగంపేట మండలం ఏర్పాటు చేయని వారు ఇప్పుడు మండలం చేస్తామంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా సమయంలో దేశంలోని ప్రజలందరికీ రెండు విడుదల టీకాలు ఉచితంగా పంపిణీ చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు.

మన దేశంతో పాటు మన దేశం నుంచి మరో వంద దేశాలకు కరోనా టీకాలు పంపిణీ చేసి ప్రపంచంలోని భారతదేశం పేరు ప్రతిష్టలు నిలిపిన మహనీయుడు ప్రధాని మోడీ అన్నారు. కరోనా సమయం నుంచి ఇప్పటివరకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. మరో ఐదు సంవత్సరాలు బియ్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకి వెళ్లగా, ఫోన్ టాపింగ్ కేసులో కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలలో హరీష్ రావు లు త్వరలో జైలు కు వెళ్లడం ఖాయమన్నారు. కేంద్రంలో రానున్న మోడీ ప్రభుత్వం అని మోడీ ప్రభుత్వానికి జిల్లా ప్రజల భాగస్వామ్యం ఉండాలంటే తనను గెలిపించాలని తనని గెలిపిస్తే రంగంపేట మండలం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.

ఎవరు బాబు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళు మొక్కితే ఎమ్మెల్సీ పదవిలోకి వచ్చిన వెంకట్రాంరెడ్డి మూడేళ్లలో ఏ రోజు గ్రామాల ముఖం చూడని వెంకటరామిరెడ్డి 100 కోట్లతో నిరుద్యోగుల కోసం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేస్తాననడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. కలెక్టర్ గా ఉండి పేద రైతుల కడుపులో కొట్టి కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన వెంకట్రామిరెడ్డి ఎంపీగా గెలిచిన ప్రజలకు ఏమి లాభం ఉండదని ఆయన పైరవీలకు వ్యాపారాల కోసం ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. చట్టాలపై కనీస అవగాహన లేని మూడు పార్టీలు మార్చి కోట రూపాయలు డబ్బులతో ఎంపీ టికెట్ కొన్న నీలం మధు బీసీ బిడ్డను గెలిపించాలని నిరుపేదల బిడ్డను అని ప్రచారం తీసుకోవడం సరికాదన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మురళి యాదవ్, నర్సాపూర్ టౌన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, పంతుల హరీష్, రంగంపేట్ చిటుకుల గిరి, గంగ రాజు, పో చందర్, వెంకట్, తుక్కాపూర్ ఆయిలి కృష్ణ, అరవింద్, అశోక్, శ్రీకాంత్, రాజు, మల్లేశం, కిష్టయ్య, శ్రీకాంత్,గణేష్, పైతర పుట్టి ప్రకాష్, కొరంపల్లి సురేష్, కొల్చారం రాజేందర్ గౌడ్, అనిల్, రాజీగారి కృష్ణ, తమ్మాలి నవీన్, చింతల యాదగిరి, తమ్మలి సంతోష్,దుర్గయ్య,తుపాకుల మల్లేశం, సాయిని రంజిత్, తేజ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed