నన్ను బాత్రూంలో పడేసి అలా చేశారు.. పారిపోయి వచ్చేశా అంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టిన బర్రెలక్క

by Disha Web Desk 10 |
నన్ను బాత్రూంలో పడేసి అలా చేశారు.. పారిపోయి వచ్చేశా అంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టిన బర్రెలక్క
X

దిశ, ఫీచర్స్ : బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిరుద్యోగ అభ్యర్ధుల ప్రతినిధిగా తెలంగాణ ఎన్నికల బరిలో నిలుచొన్న బర్రెలక్క సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేసింది. ఎన్నికల సమయంలో అందరి చూపు ఈమె వైపే ఉంది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

కొన్ని రోజుల క్రితం బర్రెలక్క పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తనకు గతంలోనే ఓ పెళ్లి జరగ్గా.. కొన్ని కారణాల వల్ల వివాహం చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు ఇచ్చింది. అయితే.. ఆ కారణం వల్లే ఎంగేజ్మెంట్ అయ్యే ముందు వరకు పెళ్లికొడుకు పేరు కానీ ఫొటోగానీ రివీల్ చేయలేదు. తాజాగా పెళ్లి తర్వాత ఓ యూట్యూబ్ ఛానెల్ కి బర్రెలక్క ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మొదటి పెళ్లి గురించి షాకింగ్ నిజాలను బయటపెట్టింది. అదేంటో ఇక్కడ చూద్దాం..

మీ మొదటి భర్త ఇంటి వాళ్లు బాత్రూంలో పడేసి కొట్టారని వార్తలు వచ్చాయి.. దీనిలో ఎంత నిజముందని యాంకర్ ప్రశ్నించగా .. అప్పుడు, బర్రెలక్క అవును ఆ వార్తల్లో నిజముంది.. నన్ను బాత్రూంలో పడేసి కొట్టి.. చిత్రహింసలు పెట్టారు.. చనిపోతానేమో అనుకున్నా .. మా అమ్మకి ఫోన్ చేసి పారిపోయి వచ్చేసా ..ఇప్పుడు మంచిగానే ఉన్నాను.. అలాగే నేను ఎదుగుతుంటే కుళ్లుకుని, కుళ్లిపోయిన బుద్ధితో కిందికి లాగే వాళ్ళు కూడా ఉన్నారంటూ అంటూ చెప్పుకొచ్చింది. ఈ వార్తపై స్పందించిన నెటిజెన్స్ ఇన్ని కష్టాలు పడింది కాబట్టే చరిత్రలో నిలిచిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed