- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: మిర్చీ కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా.. ఒకరి మృతి, 20 మందికి గాయాలు
వాహనం బోల్తా పడి ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన వరంగల్ జిల్లా (Warangal District) చెన్నారావు పేట (Channaraopet) మండల పరిధిలోని గురువారం ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: వాహనం బోల్తా పడి ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన వరంగల్ జిల్లా (Warangal District) చెన్నారావు పేట (Channaraopet) మండల పరిధిలోని గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మినీ ట్రక్కు (Mini Truck)లో 35 మంది మిర్చీ కూలీలు పని కోసం జీడిగడ్డ తండా (Jeedigutta Thanda) నుంచి ఇటుకాలపల్లి (Itukaalapally)కి బయలుదేరారు. ఈ క్రమంలోనే ట్రక్కు కోనాపురం (Konapuram) శివారులోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సుకన్య (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మొత్తం 20 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం (Postmortem) కోసం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.






