వాట్సాప్ డీపీకి ఔరంగజేబు ఫోటో.. వ్యక్తి అరెస్ట్

by Dishafeatures2 |
వాట్సాప్ డీపీకి ఔరంగజేబు ఫోటో.. వ్యక్తి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ కు వాడుకున్నందుకు ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేవీ ముంబైలో జరిగింది. వాషిలోని ఓ మైబైల్ స్టోర్ లో పని చేస్తున్న వ్యక్తి తన వాట్సాప్ డీపీకి మొఘల్ రాజు ఔరంగజేబు ఫోటోను పెట్టుకున్నాడు. దీనికి ఓ హిందూ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ మనోభావాలు దెబ్బబ తీసేందుకే సదరు వ్యక్తి ఔరంగజేబు ఫోటోను సోషల్ మీడియాలో వాడాడని అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 298, 153 ఏ ప్రకారం ఆ వ్యక్తిపై నేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాక వదిలేశారు.. కాగా అంతకు ముందు టిప్పు సుల్తాన్, ఔరంగజేబు ఫోటోలను వాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని కొన్ని హిందూ సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. ఈ క్రమంలోనే కొల్హాపూర్ లో టిప్పు సుల్తాన్ చిత్రపటాన్ని ఊరేగంపుగా తీసుకెళ్తున్న ఓ సమూహంపై రాళ్లదాడి జరిగింది.

Next Story