- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి.. ప్రియుడితో పారిపోయిన వివాహిత
మేడ్చల్(Medical) జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్(Pate Basheerabad Police Station) పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్(Medical) జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్(Pate Basheerabad Police Station) పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో వివాహిత పారిపోయింది. భర్త ఫిర్యాదుతో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే సుకన్య(35)కు సోషల్ మీడియాలో గోపి(22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలోనే రోజూ చాటింగ్స్, కాల్స్ మాట్లాడుకోవడంతో వారి మధ్య బంధం మరింత బలపడింది. దీంతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే అది అయిందని ఇద్దరూ కలిసి పారిపోయారు.
ఒకట్రెండు రోజులు వెతికిన భర్త.. చేసేదేం లేక గతనెల ఫిబ్రవరి 5వ తేదీన తన భార్య కనిపించడం లేదంటూ మిస్సింగ్(Missing Case) కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఇంటికొచ్చి పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. ప్రియుడి బైక్ ఎక్కి వెళ్లడాన్ని గమనించారు. అనంతరం వివరాలు ఆరా తీసి ఫాలో అయ్యారు. మేడ్చల్ ఆక్సిజన్ పార్క్(Medchal Oxygen Park) వద్ద పట్టుకున్నారు. బైక్‌ను అక్కడే వదిలేసి రన్నింగ్ బస్సు ఎక్కి గోపి, సుకన్య మళ్లీ పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
ఇటీవల భర్త కిడ్నీ అమ్మించి.. ఆ డబ్బుతో ప్రియుడితో వెళ్లిపోయిన భార్య ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనను ఇంకా మరువక ముందే భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో వివాహిత పారిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.






