- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి లోబర్చుకున్నాడు..!
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి మైనర్ బాలికకు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు.

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కళ్లద్దాల దుకాణం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మైనర్ బాలికకు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి లోబర్చుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డు వైపు ఉన్న కళ్లద్దాల దుకాణాన్ని కల్వకుర్తి మండలం రాచాల గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే వ్యక్తి ఏర్పాటు చేసుకున్నాడు.
కాగా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక తండ్రి ఆధారంగా బాలిక వద్ద పరిచయం చేసుకొని తన దుకాణంలో ఎవరూ లేని సమయంలో బాలికకు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. తర్వాత బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పూర్తి విచారణ జరిపి నిందితున్ని కోర్టు ముందు హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.






