- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..
by Batti.Sumithra |
చేపల వేటకు వెళ్లి వల కాలికి చిక్కడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది.

X
దిశ, బొమ్మలరామారం : చేపల వేటకు వెళ్లి వల కాలికి చిక్కడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఫక్కీర్ గూడెం గ్రామానికి చెందిన ముదిరాజ్ మత్స్యకారులు కొలిపాక రమేష్, జోగు రామచందర్, జహంగీర్ ముగ్గురు వ్యక్తులు గ్రామ సమీపంలోని శామీర్ పేట వాగు చెక్ డ్యాం వద్ద చేపల వేటలో భాగంగా వేసిన వలను తీస్తుండగా కొలిపాక రమేష్ (46) కాళ్లకు వల చిక్కుకొని నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు కొలిపాక కృష్ణ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై జి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చేపల వేటలో భాగంగా నీట మునిగి మృతి చెందిన ముదిరాజ్ మత్స్య కార్మికుడు రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ మెడబోయిన గణేష్ కోరారు.
Next Story






