- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాచారం పారిశ్రామికవాడలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు
by Javid Pasha |
హైదరాబాద్ లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్న హల్దీరామ్, కుర్ కురే స్నాక్స్ తయారీ కంపెనీకి మంటలు వ్యాపించాయి. కంపెనీ చుట్టుపక్కల పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటన ఘటనా స్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే భారీ మంటలతో పొగ కమ్ముకురావడంతో మంటలు అర్పేందుకు ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. 3 గంటలుగా మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. కాగా అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రాచకొండ సీపీ చౌహాన్ ఘటనా ప్రదేశానికి వచ్చి పరిస్థితుల గురించి ఆరా తీశారు.
Next Story






