నాగర్ కర్నూల్‌లో దారుణం.. బాలుడిని కిరాతంగా హతమార్చిన దుండగులు

by Disha Web |
నాగర్ కర్నూల్‌లో దారుణం.. బాలుడిని కిరాతంగా హతమార్చిన దుండగులు
X

దిశ, పెంట్లవెల్లి: నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామ సమీపంలో ఓ బాలుడిని దుండగులు హతమార్చి నిప్పంటించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. దాదాపుగా తొమ్మిది సంవత్సరాల వయసున్న బాలుడిని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి హత్య చేసి కాలువ సమీపంలో నిప్పంటించి వెళ్లారు. అయితే నిప్పంటించిన కొంతసేపటికి వర్షం కురియడంతో మంటలు చల్లారడంతో బాలుని మృతదేహం అర్ధ భాగం కాలిపోయింది. శనివారం వ్యవసాయ పొలాల్లో పనుల కోసం వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి గ్రామంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కొల్లాపూర్ సీఐ యాదాద్రి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. బాలుడు ఏ ప్రాంతానికి చెందిన వాడు, ఇతడిని కుటుంబ తగాదాలు, లేదా ఇతర కారణాల వల్ల హత్య చేశారా.. లేక ఇతర కారణాల వల్ల హత్య చేశారా అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు వనపర్తి తదితర పోలీస్ స్టేషన్లకు కొల్లాపూర్ పోలీసులు సమాచారం అందజేసి బాలుడి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed