- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళ నోట్లో మూత్రం పోసి.. 9 మంది మద్యం తాగుతూ రాత్రంతా అత్యాచారం!?
నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో శనివారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో శనివారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. స్నేహితుడితో ఉన్న మహిళను గమనించిన కామాంధులు యువకుడిపై దాడి చేసి బంధించి ఆమెపై రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. కామాంధుల చేతిలో నలిగి, అలిసిపోయిన ఆమె.. దాహం వేస్తుందంటే నోట్లో మూత్రం పోసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. విశ్వాసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
చెట్టు చాటున మిత్రుడితో కలిసి ఉండగా..
ఓ మహిళ ఊరుకొండ పేటలో జరుగుతున్న వేడుకలకు తన సహచరునితో కలిసి వెళ్లి తిరిగి వస్తూ సమీపంలో ఉన్న చెట్టు చాటున మాట్లాడుకుంటున్నారు. ఆలయంలో పనిచేసే యువకుడు అటుగా వెళ్తూ ఆ ఇద్దరిని గమనించాడు. వెంటనే అతడు తన మిత్రులకు ఫోన్ చేసి ఇక్కడ జంట ఉన్నారంటూ సమాచారం ఇచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న 8 మంది యువకులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ మహిళతోపాటు ఆమె సహచరునితో వాదనకు దిగారు. ఆపై యువకుడిపై దాడి చేసి, అతని షర్ట్ విప్పి చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత మహిళపై 8 మంది కలిసి సామూహిక అత్యాచారం చేసినట్టు సమాచారం.
మూత్రంతో గొంతు తడిపి..
మద్యం తాగుతూ అత్యాచారానికి పాల్పడిన కామాంధులు అంతటితో ఆగకుండా మరో యువకుడికి ఫోన్ చేసి ఇంకా మందు తేవాలని ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించారు. మళ్లీ మద్యం సేవిస్తూ తెల్లవారుజామున 4 గంటల వరకు వరుసబెట్టి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడి చేశారు. గంటల తరబడి వారి చేతిలో హింసకు గురైన ఆ మహిళ అలిసిపోయి దాహం వేస్తోంది.. కొన్నిమంచి నీళ్లు ఇవ్వండి అని వేడుకుంది. అయినా కనికరించని దుర్మార్గులు ఆమె నోట్లో మూత్రం పోసి క్రూరంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ మహిళ తన సహచరుడిని విడిపించుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.
సీసీ కెమెరా ఫుటేజీతో చిక్కిన యువకుడు
బాధితురాలి ఫిర్యాదుతో ఊరుకొండ పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి నిందితులను గుర్తించే పనిలోపడ్డారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. వాటిల్లో దేవాలయంలో పనిచేసే యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో రాతంత్రా జరిగిన దారుణం బయటపడింది. అతడు ఇచ్చిన సమాచారంతో ఊరుకొండ పోలీసులు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు చివరికి మద్యం తెచ్చిన 9వ వ్యక్తి కూడా అత్యాచారానికి పాల్పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మరోవైపు ఈ కేసును నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ లకు సవాలుగా మారింది.






