అప్పు తీర్చిన వెస్టిండీస్

by  |
అప్పు తీర్చిన వెస్టిండీస్
X

దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది మే నెలలో ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి తీసుకున్న అప్పును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తీర్చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వెస్టిండీస్ బోర్డు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. కనీసం విమాన టికెట్ల కూడా డబ్బులు లేకపోవడంతో ఈసీబీ వడ్డీ రహిత అప్పును ఇచ్చింది. వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు ముందు డబ్బులు ఇవ్వడంతో విమర్శలు వచ్చాయి. విండీస్ బోర్డును కొనేసిందని ఆరోపణలు వచ్చాయి. తాజా ఈసీబీ ఇచ్చిన అప్పును తీర్చేసినట్లు విండీస్ బోర్డు సీఈఓ జానీ గ్రేవ్ స్పష్టం చేశారు. సభ్యులకు ఇవ్వాల్సిన వాటాను ఐసీసీ విడుదల చేసింది. విండీస్ బోర్డుకు ఏడు మిలియన్ డాలర్లు(రూ. 523 కోట్లు) వచ్చాయి. ఇందులో నుంచి ఈసీబీకి రూ.224కోట్లను చెల్లించింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఆటగాళ్ల జీతాలు, ప్రయాణ, వసతి ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో అప్పు తీసుకున్నామని కానీ, దానిపై విమర్శలు రావడం బాధించిందని విండీస్ బోర్డు సీఈవో జానీ గ్రేవ్స్ ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed