విజయవాడకు రానున్న సీతారాం ఏచూరి.. ఎందుకంటే ?

by  |
cpm
X

దిశ, ఏపీ బ్యూరో: ఈనెల 14న విజయవాడలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పర్యటించనున్నారని ఆపార్టీ నేత సీఎం బాబూరావు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈనెల 27న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ విజయవాడ నగరంలో కృష్ణలంక భ్రమరాంబపురం, అజిత్ సింగ్ నగర్ ,పాయికాపురంలోని కండ్రిక, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్రలు చేపట్టారు. ఈ సందర్భంగా సీహెచ్ బాబూరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు లాభాలు పంచుతూ సామాన్యులకు భారాలు మిగిలిస్తోందని ఆరోపించారు.

వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో కేంద్రం ప్రజల నడ్డి విరిచిందన్నారు. కేంద్ర విద్యుత్ చట్ట సవరణలతో భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. బీజేపీ దుర్మార్గాలపై వైసీపీ, టీడీపీలు పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ విధానాలపై సీపీఎం ఆందోళన చేపట్టబోతుందని.. ఈ నెల 27న జరిగే భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. అలాగే ఈనెల 14న విజయవాడలో జరిగే సీతారాం ఏచూరి సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Next Story

Most Viewed