వాళ్ల లాభం కోసమే పెట్రోల్ ధరల పెంపు: నారాయణ

by  |
వాళ్ల లాభం కోసమే పెట్రోల్ ధరల పెంపు: నారాయణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రయివేటు కంపెనీల లాభాల కోసమే ప్రభుత్వాలు పెట్రోల్ ధరలను పెంచుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. ప్రయివేటు సంస్థలకు పాలకులు ఊడిగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా నారాయణ మీడియాతో మట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చినప్పుడు 100 డాలర్లు ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం 40 డాలర్లకు చేరుకుందన్నారు. కానీ పెట్రోల్ ధరలు మాత్రం రోజురోజుకూ పెంచుకుంటుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రో ధరలను పెంచడం ద్వారా రూ.7లక్షల కోట్లు ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేసిందన్నారు. లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపరన్నారు. ప్రజలంతా కరోనా భయంతో వణికిపోతుంటే కేంద్ర హోంశాఖ మంత్రి బీహార్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వర్చవల్ ప్రచారం పేరుతో 72వేల బూత్ కమిటీలల్లో పంపిణీ చేసిన టివీలకు రూ.150కోట్లు ఖర్చు చేశారని నారాయణ ఆరోపించారు.



Next Story