ఎంత పెంచారో.. అంత దించాలి : చాడ వెంకట రెడ్డి

by  |
Chada-CPI-1
X

దిశ, కరీంనగర్ సిటీ: ప్రజలపై భారం వేస్తే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తాకగానే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై సుంకాలు తగ్గించిందని, కొన్ని రాష్ట్రాలు స్పందించాయని కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించక పోవడం అన్యాయమన్నారు. ప్రజలపై భారం పడకుండా ఉండాలంటే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ పై ట్యాక్స్ భారీగా తగ్గించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం కూడా కంటి తుడుపు చర్యలుగా ఐదు రూపాయలు, పది రూపాయలు తగ్గించకుండా ఎంత పెంచారో అంత దించాలన్నారు. ఏడు సంవత్సరాల మోడీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల ప్రజల బ్రతుకులు ఏమీ మరలేదని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యాన్ని నివారించాలని.. కొనుగోలు కేంద్రాలు పెంచి పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి, జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్, అందె స్వామి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బోయిని తిరుపతి, అందె చిన్న స్వామి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, నల్లగొండ శ్రీనివాస్, నాయకులు పైడిపెల్లి రాజు, మాడిశెట్టి శ్రీధర్, ఇల్లందుల చిన్న రాజయ్య, బోయిని మొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed