‘బ్యాంకుల పని సమయాన్ని తగ్గించాలి’

by  |
Nine banks
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంక్ ఉద్యోగులకు పరిస్థితులు మెరుగుపడే వరకు బ్యాంకు సేవల్లో పబ్లిక్ డీలింగ్ సమయాన్ని రోజుకు 3 గంటలకు తగ్గించాలని బ్యాంక్ యూనియన్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)ని కోరాయి. దేశవ్యాప్తంగా తొమ్మిది యూనిట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఐబీఏ చైర్మన్ రాజ్ కిరణ్ రాయ్‌ను అభ్యర్థించాయి. నిరంతరం వినియోగదారులతో కొనసాగే శాఖల్లో, నేరుగా కస్టమర్లతో నిర్వహించబడుతున్న కౌంటర్ల వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశాలున్నాయని, ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలతో నేరుగా ఉండే సేవల సమయాన్ని తగ్గించాలని వివరించాయి.

దేశంలో అనేక ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడటం, మరణాలు సంభవించడం ఉద్యోగుల్లో ఆందోళనను పెంచుతోందన్నారు. మహమ్మారి దారుణంగా వ్యాపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సమస్యకు వెంటనే పరిష్కరించాలని మొత్తం బ్యాంకింగ్ రంగం తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు యూఎఫ్‌బీయూ తెలిపింది. పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రాథమిక, అవసరమైన బ్యాంకింగ్ సేవలకు మాత్రమే పరిమితం చేయాలని, బ్యాంకింగ్ పని సమయాన్ని రోజుకు 3-4 గంటలకు మార్చాలని యూనియన్లు డిమాండ్ చేశాయి.

Next Story