వధువు, వరుడు చిలిపి పని.. పరుగులు పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి

by  |
వధువు, వరుడు చిలిపి పని.. పరుగులు పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: కాబోయే వధువు, వరుడు చేసిన ఓ చిలిపి పని రాష్ట్ర ముఖ్యమంత్రి‌తో పాటు పోలీస్ ఉన్నతాధికారుల్ని పరుగులు పెట్టేలా చేసింది. ఇంతకీ ఆ యువ జంట చేసిన చిలిపి పనేంటి? పరుగులు పెట్టిన ఆ ముఖ్యమంత్రి ఎవరా’అని అనుకుంటున్నారా?

పెళ్లి ఓ అపురూప ఘట్టం. వందేళ్ల జీవితానికి మార్గం వేసే సోపానం. అలాంటి మధుర వేడుక జీవితాంతం నిలిచిపోయేలా యువత ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ వేడుకలు మరింత వినూత్నంగా ఉండాలని తపిస్తున్నారు. అయితే ఈ ప్లాన్లు కొన్ని ప్రాణాలు తీస్తుంటే మరికొన్ని జైలు పాలు చేస్తున్నాయి.

తాజాగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రం జష్పూర్ జిల్లాకు చెందిన వధువు, వరుడు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఆ రాష్ట్రానికి చెందిన రాయ్ పూర్ సిటీకి వచ్చారు. ఆ సిటీలో ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లుగా “AW 109 Power Elite” అనే హెలికాప్టర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్‌ పాల్గొన్నారు. అయితే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అనంతరం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అంతే ఆ ఫోటోలు చూసిన కాంగ్రెస్ పార్టీ నేత, ఛత్తీస్ గడ్ సీఎం భూపేష్ బాగల్ పాటూ రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ఏవీయేషన్ డైరెక్టర్, స్థానిక పోలీసులు కంగుతిన్నారు. అందుకు కారణం వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోల్లో ఉన్న హెలికాప్టర్ ను సీఎం భూపేష్ బాగల్ ఉపయోగిస్తారు. దీంతో హుటాహుటీనా సీఎం భూపేష్ బాగల్ రాష్ట్ర డీజీపీ డీఎం అవస్థికి విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా సీఎం భూపేష్ బాగల్ డ్రైవర్ యోగేశ్వర్ సాయి’ని రాష్ట్ర ఏవియేషన్ డైరెక్టర్ కార్యాలయం అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణు దేవ్ సాయి బంధువు , తన స్నేహితుడు హెలికాప్టర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొన్నట్లు ఒప్పుకున్నాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో యోగేశ్వర్ సాయిని విధుల నుంచి తొలగించారు.

ఈ సందర్భంగా రాయ్‌పూర్ ఎస్పీ అజయ్ యాదవ్ మాట్లాడుతూ ‘ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్‌కు రాష్ట్ర ఏవీయేషన్ అధికారుల నుంచి తమకు అనుమతి లభించిందని, అందుకే తాము సీఎం భూపేష్ బాగల్ హెలికాప్టర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ లో పాల్గొన్నట్లు నిందితులు చెప్పారని అన్నారు. దీనిపై వారంలోగా తమకు నివేదిక అందుతుందని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

కాగా ప్రీ వెడ్డింగ్ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి వికాస్ తివారీ రాష్ట్ర డీజీపీకి డీఎం అవస్థీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి భద్రతలో లోపాలు తలెత్తుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి వినియోగించే హెలికాప్టర్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగడం ఆందోళనగా ఉంది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed