ఆగిపోయిన వోల్వో ఉత్పత్తి!

by  |
ఆగిపోయిన వోల్వో ఉత్పత్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ధాటికి ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉత్పత్తిని నిలిపేశాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘వోల్వో’ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తిని ఆపేస్తున్నట్టు ప్రకటించింది. బెల్జియంలో ఉన్న ప్లాంట్‌ని మంగళవారం నిలిపేయగా, యూరప్, అమెరికాలో ఉన్న ప్లాంట్లను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు వెల్లడించింది. అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న ప్లాంట్‌ను ఈ నెల 26 నుంచి ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఉద్యోగులు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉడేందుకు, తద్వార సంస్థ కొనసాగడం కోసం ఇప్పటికైతే ప్లాంట్‌లను మూసేస్తున్నామని సంస్థ వివరించింది. ఇప్పటికే మూసేసిన బెల్జియం ప్లాంట్‌ను ఏప్రిల్ ఐదున, మిగిలిన ప్రాంతాల్లో 14వ తేదీన తిరిగి ఉత్పత్తిని మొదలుపెడతామై సంస్థ సీఈవో శామ్యూల్ సన్ తెలిపారు. ఆ సమయం వరకూ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందన్నారు.

tags : Coronavirus outbreak, Volvo, corona impact



Next Story

Most Viewed