దేశంలో పెరుగుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసులు.. హెచ్చరికలు జారీ చేసిన ICMR

by Disha Web Desk 2 |
దేశంలో పెరుగుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసులు.. హెచ్చరికలు జారీ చేసిన ICMR
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి బారినుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో మరో వైరస్ వెలుగుజూసింది. కొవిడ్ లాంటి లక్షణాలతో దేశంలో కలకలం రేపుతోన్న ఇన్‌ఫ్లుయెంజా.. ప్రసుతం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దగ్గు, జ్వరం, వాంతులు, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలతో గత రెండు, మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఆసుపత్రుల పాలు అవుతున్నారు. వీటిలో చాలా కేసులకు ఇన్‌ఫ్లుయెంజా ఏ వైరస్ కారణమవుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిపుణులు వెల్లడించారు. ఈ ఇన్ఫెక్షన్ నుండి మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్నవారిని రక్షించుకోవడానికి వెంటనే జాగ్రత్తలు పాటించాలని ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది.

లక్షణాలు: దగ్గు, వికారం, వాంతులు, గొంతు మంట, బాడీ పెయిన్స్, అతిసారం

చేయాల్సిన పనులు: చేతులను క్రమం తప్పకుండా సబ్సుతో కడగాలి. లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలి. కళ్లను, ముక్కును అదే పనిగా తాకడం మానుకోవాలి. వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలను తాగాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షాణాలు ఉంటే వెంటనే పారాసిటమాల్ వేసుకోవాలి.

చేయకూడని పనులు: అతిగా అందరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. హగ్ చేసుకోవడం కూడా మానేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. స్వీయ వైద్యం చేసుకోకూడదు. వైద్యులను సంప్రదించిన తర్వాతనే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఇతరులకు వీలైనంత దూరం పాటించండి.

Also Read: చేపలను ఇష్టంగా తింటున్నారా..అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!



Next Story

Most Viewed