నాన్‌వెజ్ ప్రియులకు ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదు.
కొంత మంది చేపలకు దూరంగా ఉంటారు. అలాంటి వారు చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.
చేపల్లో కాల్షియం, పాస్పరస్, వంటి పోషకాలు ఉండి బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధుల కంట్రోల్‌తో ఉంటాయి.
అలాగే కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే చేపలను తినాలి.
చేపల్లో ఉండే ప్రోటీన్ల వల్ల బరువు తగ్గడంతో పాటు మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
జింక్, అయోడిన్, విటమిన్ ఎ, రోగనిరోధక శక్తిని పెంచి కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి.
చేపలను వారానికి కనీసం రెండు సార్లు తిన్నా అల్జీమర్స్, డిప్రెషన్, పలు రకాల క్యాన్సర్లు రాకుండా రక్షిస్తాయి.