మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఖచ్చితంగా కరోనా ఉన్నట్లే..

by  |
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఖచ్చితంగా కరోనా ఉన్నట్లే..
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా దేశంలో విలయ తాండవం చేస్తుంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ వలన అక్కడక్కడా లాక్ డౌన్ లు ప్రకటిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ గురించి కొంచెం భయపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వస్తున్న కరోనా కేసుల్లో చాలామందికి లక్షణాలు కనిపించడం లేదు. అయితే మనకు కరోనా సోకిందని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతకుముందు జలుబు, దగ్గు, జ్వరం ఉంటే కరోనా అని నిర్దారించేవాళ్లు. కానీ ఇప్పుడు వీటితో పాటు మరికొన్ని లక్షణాలు గుర్తించినట్లు వైద్యులు తెలుపుతున్నారు.

ఈ మధ్య కాలంలో కరోనా సోకిన వారికి కొన్ని కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. అవే నోరు ఎండిపోవడం, కళ్ళు ఎర్రబడడం, నోటిలో గాయాలవ్వడం లాంటివి కనిపిస్తే మీకు ఖచ్చితంగా కరోనా సోకినట్లే. జ్వరం, జలుబు, దగ్గు మొదటి నుండి కరోనా కేసుల్లో కనిపిస్తున్నవే. వాటితో పాటు గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ కూడా ఉంటే టెస్ట్ లు చేయించుకోవాల్సిందే. అంతేకాకూండా ఈ వైరస్ ప్రభావం మెదడుపైన కూడా చూపిస్తుందని నిపుణులు స్పష్టం చేశారు. జ్ఞాపక శక్తి మందగించడం, సాధారణ పనులను చేసుకోలేకపోవడం, ఒకదానిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని నివేదికల్లో పొందుపర్చారు.

ఇక వీటితో పాటు చలి, వణుకు, తరుచు మారే శరీర ఉష్ణోగ్రతలు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం లాంటి లక్షణాలు సైతం కరోనాను సూచిస్తాయి. వీటి వలన సరిగ్గా తినలేకపోవడం, నిద్రపోలేకపోవడం వలన రోగి నిరసమైపోతాడని వైద్యులు తెలుపుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే కరోనా టెస్ట్ లు చేయించుకొని, వైద్యుల సూచనలను, సలహాలను తీసుకోవడం ఉత్తమమని నిపుణులు వివరిస్తున్నారు.

Next Story

Most Viewed