అలర్ట్.. జంతువులకు సోకుతున్న కరోనా.. ఆందోళనలో శాస్త్రవేత్తలు

by  |
Corona positive
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికాలో వైరస్ మళ్లీ విరుచుకుపడుతోంది. ఈసారి జంతువులకు కూడా వైరస్ సోకుతుండటం ఆందోళనకరంగా మారింది. ఒహాయో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న తెల్లతోక జింకలకు వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. 129 జింకలకు కరోనా సోకినట్టు తెలుస్తోంది.

అయితే, మనుషుల ద్వారానే జింకలకు వైరస్ సంక్రమించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అడవి జింకలు సార్స్ కోవ్-2 వైరస్‌కు రిజర్వాయర్లుగా మారే అవకాశం ఉందని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed