ఏపీలో 80 వేలు దాటిన కేసులు

by  |
ఏపీలో 80 వేలు దాటిన కేసులు
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. ప్రమాదకర రీతిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆలస్యంగా కేసులు నమోదు కావడం ప్రారంభమైన ఈ జిల్లాలో పదకొండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. గడచిన 24 గంటల్లో ఏపీలో 8,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.

ఇందులో అత్యధిక కేసులు తూర్పుగోదావరి (1029) జిల్లాలో నమోదయ్యాయి. ఆ తరువాత వరుసగా అనంతపురం (984), కర్నూలు (914), విశాఖపట్టణం (898), పశ్చిమ గోదావరి (807), గుంటూరు (703), చిత్తూరు (630), కడప (494), శ్రీకాకుళం (374), కృష్ణా (359), ప్రకాశం (355), విజయనగరం (322), నెల్లూరు (278) జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ లో ఇప్పటి వరకు 80,858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇందులో 39,990 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనాకి చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. మరో 39,935 మంది కరోనాకు చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. గడచిన 24గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 11 మంది మరణించగా, కృష్ణా (9), కర్నూలు (8), శ్రీకాకుళం (7), పశ్చిమగోదావరి (5), గుంటూరు (3), వైజాగ్ (3), చిత్తూరు (1), ప్రకాశం (1), విజయనగరం (1) జిల్లాల్లో మొత్తం 49 మంది మరణించారని, దీంతో ఏపీలో ఇప్పటి వరకు 933 మంది కరోనా కారణంగా మృతి చెందారని వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.



Next Story

Most Viewed