వైద్యుల నిర్లక్ష్యంతో కరోనా పేషెంట్ మృతి..

by  |
వైద్యుల నిర్లక్ష్యంతో కరోనా పేషెంట్ మృతి..
X

దిశ,నాగార్జున సాగర్: వైద్యుల నిర్లక్ష్యం మూలంగా కరోనా కాటుకు యువకుడు మృతి చెందిన ఘటన అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29న ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన మర్రి రామలింగయ్యకు జ్వరం వచ్చింది. దీంతో అతను ఈనెల 1న హాలియా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. ఈపరీక్షల్లో రామలింగయ్య‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స కోసం నాగార్జున సాగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అయితే సాగర్ ఆసుపత్రిలో చేరిన తర్వాత రామలింగయ్య‌కు ఆయసం ఎక్కువగా రావడంతో వైద్యులను అతను పిలిచాడు. తనకు ఆయసం వస్తోందని ఆక్సిజన్ పెట్టాలని వేడుకున్నా వైద్యులు పట్టించుకోలేదు. ఇదే విషయమై సాగర్ ఆసుపత్రిలో వైద్యులు సరైన వైద్యం అందించడం లేదని జిల్లా కలెక్టర్ కు బాధితుడు లేఖ రాసి దానిని వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. అనంతరం రామలింగయ్య‌ను వైద్యులు మెరుగైన వైద్యం కోసం 3వ తేదీన నల్గొండ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే రామలింగయ్య పరిస్థితి విషమంగా మారింది. సరైన వైద్యం అందక రామలింగయ్య మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. రామలింగయ్య రాసిన లేఖలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన బాధను విన్నవిస్తు కరోనాతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరడం గమనార్హం.


Next Story

Most Viewed