కరోనా బారిన పడకండంటూ ఫోన్లకు మెసేజ్..

by  |
కరోనా బారిన పడకండంటూ ఫోన్లకు మెసేజ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై సీఎం పలు సూచనలు చేశారు. గతంలో ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అలానే జాగ్రత్తలు పాటించాలన్నారు. అందరూ శానిటైజర్ మాస్కును ధరించాలన్నారు. ఈ సందేశాన్ని రాష్ట్రంలోని అన్ని మొబైల్ ఫోన్లకు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో ఎస్ఎంఎస్ రూపంలో సందేశాన్ని పంపుతున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వచ్చేసింది. మీ ఆరోగ్యం పట్ల మేం ఆందోళన చెందుతున్నాం. అందువల్ల ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి.
• మాస్కులు ధరించండి.
• సోషల్ డిస్టెన్స్ పాటించండి
• జనం గుమికూడే ప్రాంతాలకు దూరంగా ఉండండి
• సబ్బుతో చేతులు కడుక్కోండి
• వైరస్ సోకిందన్న సందేహం వస్తే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్ష చేయించుకోండి.
• ఒకవేళ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లయితే కొవిడ్ ట్రీట్‌మెంట్ కిట్‌ను తీసుకోండి. డాక్టర్ల సలహా మేరకు మందుల్ని వాడండి.

ఇట్లు,
కే. చంద్రశేఖర్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి.


Next Story

Most Viewed