సెక్యులరిజం దేశానికి అతిపెద్ద ముప్పు : యూపీ సీఎం

by  |
UP CM Yogi Adityanath
X

లక్నో: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. లౌకికవాదం ఈ దేశానికి అతిపెద్ద ముప్పు అని ఆయన అన్నారు. ఇటీవలే లక్నోలో జరిగిన గ్లోబల్ ఎన్‌సైక్లోపీడియా (రామాయణం గురించి) మొదటి ఎడిషన్‌ విడుదల సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. యోగి మాట్లాడుతూ.. ‘లౌకికవాదం అనే పదం దేశ సాంప్రదాయ, వారసత్వ అభివృద్ధికి ముప్పులా పరిణమించింది.

ప్రపంచ వేదికలమీద ఇది ఒక మాయని మచ్చగా మారింది’ అని అన్నారు. పలువురు వ్యక్తులు, వ్యవస్థలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం సెక్యూలరిజాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. డబ్బుల కోసం ఇలా తప్పుడు ప్రచారం చేసేవారికి తగిన శిక్ష అనుభవించక తప్పదని యోగి హెచ్చరించారు. రామాయణ, మహా భారతాలు మనకు జీవిత పాఠాలు నేర్పడమే కాకుండా భారత సరిహద్దుల గురించి కూడా విషదీకరించి చెప్పాయని యోగి అన్నారు. శ్రీరాముడు పాలించిన కాలంలో ఆయన రాజ్యాన్ని పాకిస్థాన్‌ను దాటి విస్తరింపజేశారనీ.. తన సోదరుడి కుమారుడిని పాకిస్థాన్‌‌కు రాజుగా చేశాడని యోగి తెలిపారు.


Next Story

Most Viewed