హెల్త్ మినిస్టర్ ఒకటి చెబితే.. హెల్త్ డైరెక్టర్ మరొకటి చెబుతున్నడు

by  |
హెల్త్ మినిస్టర్ ఒకటి చెబితే.. హెల్త్ డైరెక్టర్ మరొకటి చెబుతున్నడు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌కి అందిన మెరుగైన వైద్యం సామాన్య ప్రజలకు అందించలేరా అని కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు విద్య, వైద్యం అనేవి రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా జీవన్ రెడ్డి గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు. కరోనా రోగులకు వైద్యం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు.

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు వాడే మందుల కొరత ఏర్పడిందంటే ప్రస్తుతం కరోనా ఎంత వేగంగా విజృంభిస్తుందో అర్ధం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్‌లో జరిగిన ఉపఎన్నిక ద్వారా వేలాది మంది కరోనా బారినపడ్డారని తెలిపారు. సభలు నిర్వహించి కోవిడ్ నిబంధనలు ఉల్లంగించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తు్న్న ఇప్పటివరకూ అమలు చేయకపోవడం సరికాదన్నారు. కరోనా పరిస్థితులపై ఆరోగ్య మంత్రి ఒకటి చెబితే హెల్త్ డైరెక్టర్ మరొకటి చెబుతున్నారన్నారు. కరోనా రోగుల ఆసుపత్రి బిల్లులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించాలని సూచించారు. రాష్ట్రంలో బెడ్లు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.



Next Story

Most Viewed