లాకప్ డెత్ చుట్టూ తిరిగిన కాంగ్రెస్ రాజకీయం..

by  |
batti-..-pragathi-bavan
X

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ప్రగతి భవన్ వేదికగా జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ ఘటనలో మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశామన్నారు. మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్‌ను కోరామన్నారు.

అంతేకాకుండా, మరియమ్మ లాకప్ డెత్‌కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు భట్టి వివరించారు. దళిత, గిరిజనులపై జరుగుతున్న దాడులను సీఎం దృష్టికి తీసుకెళ్ళగా.. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాగా, కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ఎన్నో లేఖలు రాయగా.. ఇవాళ కేవలం10 నిమిషాల వ్యవధిలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీటింగ్ ఫిక్స్ అయినట్లు సమాచారం అందిందని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.

Next Story

Most Viewed