నాటకాలు చాలు కేసీఆర్.. సభను అడ్డుకుంటామంటూ వార్నింగ్..

by  |
Naik
X

దిశ, హలియా : ఇచ్చిన హామీలను విస్మరించి సీఎం కేసీఆర్.. హుజురాబాద్ ఎలక్షన్ కోసమే దళితులపై ప్రేమ ఒలకబొస్తున్నాడని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. ఆదివారం హాలియా మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ బ్లాక్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 80% శాతం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పూర్తి చేసిందని అన్నారు. మిగిలిన 20% శాతం పనులను పూర్తి చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం హుజురాబాద్ ఎలక్షన్ కోసమే దళిత బంధు తీసుకొచ్చాడని ఆరోపించారు. హుజురాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే దళితులందరికీ మూడు ఎకరాల భూమి, గిరిజనులకు పోడు భూమి పట్టాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మైనార్టీ, గిరిజనులకు12 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్రమంతటా దళితులకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ముఖ్యమంత్రి సభను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్, త్రిపురారం ఎంపీపీ అనుముల పాండమ్మ, శ్రీనివాస్ రెడ్డి, అనుముల వైస్ ఎంపీపీ మాలే అరుణ సత్యనారాయణ రెడ్డి, జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి మట్టారెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్, కౌన్సిలర్లు ఎడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి, పిల్లి చంద్రకళ ఆంజనేయులు, గౌని సుధారాణి, కుందూరు వెంకట్ రెడ్డి, రిక్కల సుధాకర్ రెడ్డి, పొదిల కృష్ణ, నెర్మెట్ట వెంకట్ రెడ్డి, పాంపాటి శ్రీనివాస్, నకిరేకంటి సైదులు, అమరేందర్ రెడ్డి, కోటా నాగిరెడ్డి, గోపిశెట్టి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed