ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచించడం లేదు…

by  |
ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచించడం లేదు…
X

దిశ, వెబ్ డెస్క్:
తనకు కావాల్సిన బిల్లులను పాస్ చేసుకుంటూ ప్రభుత్వం వెళ్లిపోతోందే తప్పా, ప్రజల కోసం అసలు ఆలోచించడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రత్యేక శాసన సభ సమావేశాల అనంతరం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ….ప్రజా సమస్యలపై చర్చించేందకు, మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. సర్కార్ ప్రవేశ పెట్టిన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ బిల్లుపై చర్చించాలను కున్నామని తెలిపారు. కానీ అందుకు ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తెస్తున్న సమయంలోనే ధరణి పోర్టల్ పై అనుమానాలు రేకెత్తాయన్నారు. ధరణి పోర్టల్ లో నమోదైన భూముల వివరాల్లో చాలా తప్పులు ఉన్నాయని తెలిపారు. వాటి ఆధారంగా అగ్రికల్చర్ ల్యాండ్ ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా ఎవరైనా మార్చుకోవాలని దరఖాస్తు చేసుకుంటే అప్పటికప్పుడు దాన్ని ఎమ్మార్వో కన్వర్ట్ చేస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని తెలిపారు. ఇక ఇప్పటికే ధరణిలో తప్పులు జరిగాయనీ…వాటిని సరిచేయకుండా మరో పెద్ద తప్పు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందన్నారు. దీని వల్ల అసలు హక్కుదారులకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై గతంలో సభలో ప్రస్తావించగా…రాష్ట్రంలోని భూమి మొత్తాన్ని సర్వే చేసి సెటిల్ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని అన్నారు. కానీ ఇప్పుడు హడావిడిగా ఒక్కరోజు సభను పెట్టి ధరణిలో ఎంట్రీ చేస్తామని చెప్పారని తెలిపారు. కాగా సభలో ప్రతిపక్షాలకు స్పీకర్ సరైన సమయం ఇవ్వడం లేదన్నారు.


Next Story

Most Viewed