విహారయాత్రలా ధర్నాలా.. బీజేపీ, టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఆగ్రహం

by  |
విహారయాత్రలా ధర్నాలా.. బీజేపీ, టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఆగ్రహం
X

దిశ, హుస్నాబాద్: సీఎం కేసీఆర్ ఢిల్లీలో గులాంగిరి చేస్తూ, గల్లీలో నిరసనలతో కుస్తీ పడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి అన్నారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రైతుకు మద్దతుగా ధర్నాలు రాస్తారోకోలు చేయడం దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమాల్లో రైతు లేరని, పార్టీ నాయకులు ఖరీదైన కారుల్లో వచ్చి ధర్నా, రాస్తారోకోల్లో పాల్గొని వెళ్లిపోయారని ఆరోపించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు ఈ ప్రాంత ప్రజల పై చిత్తశుద్ధి ఉంటే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి కోరితే ఇవ్వని పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతలకు పర్మిషన్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అనంతరం హుస్నాబాద్ పట్టణం కిసాన్ సెల్ అధ్యక్షుడిగా గొర్ల వెంకన్నను నియమిస్తున్నట్లు శ్రీరాం చక్రవర్తి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి చేయడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ సీనియర్ చిత్తారి రవీందర్, ఎండి హాసన్, అక్కు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Next Story