TRS కార్పొరేటర్ మర్డర్ కేసులో ‘నాయిని’కి క్లీన్ చిట్..

by  |
TRS కార్పొరేటర్ మర్డర్ కేసులో ‘నాయిని’కి క్లీన్ చిట్..
X

దిశ‌ ప్ర‌తినిధి, వరంగ‌ల్ : హనుమకొండలో సంచలనం సృష్టించిన నాటి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యకేసులో వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల అధ్య‌క్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి హైకోర్టులో క్లీన్‌చిట్ ఇచ్చింది. నాయినిపై వచ్చిన ఆరోపణలు రుజువు కానందున చార్జిషీట్ నుంచి నాయిని పేరు తొలగించాల‌ని పోలీస్‌శాఖ‌ను హైకోర్టు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. 2017 జులై 13న టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హన్మకొండలో హత్యకు గురయ్యారు.

ఈ హ‌త్య‌కేసు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసులో డీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న నాయిని రాజేందర్ రెడ్డితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్‌లో రాజేందర్ రెడ్డి ఏ-4గా ఉన్నారు. అయితే, రాజకీయ కక్షసాధింపు నేపథ్యంలోనే తనను ఈ కేసులో ఇరికించారని రాజేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసుల నుంచి సాంకేతిక ఆధారాలు ఏమి లేకపోవడంతో రాజేందర్ రెడ్డిని నిర్దోషిగా ప్రకటిస్తూ క్లీన్ చిట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. రాజకీయ కక్షలతో తనపై కేసు పెట్టారని.. కానీ, చివరికు న్యాయమే గెలిచిందని నాయిని వెల్లడించారు.


Next Story

Most Viewed