ఖమ్మం ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

by  |
Indira shobhan
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖ‌మ్మం జిల్లాలో పోడు మ‌హిళా రైతుల‌ను, ప‌సిపిల్లల త‌ల్లుల‌ను జైలులో పెట్టి చిత్రహింస‌ల‌కు గురిచేసిన జైలు సిబ్బందిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతూ గురువారం వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరా శోభ‌న్ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఇందిరా శోభ‌న్ మాట్లాడుతూ రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు క‌నీస గౌర‌వం లేక‌పోవ‌డం దౌర్భాగ్యం అన్నారు. ప్రతి రోజు ఎక్కడో ఒక ద‌గ్గర మ‌హిళ‌లు అవ‌మాన ప‌డుతూనే ఉండటం ప్రభుత్వ చేతకాని తనానికి అద్దం పడుతుందన్నారు.

ఇటీవల ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్నసాగర్ గ్రామంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న 18 మంది మహిళా రైతులను అరెస్టు చేసిన ఘటనని వైఎస్ఆర్టీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అరెస్టు అయిన వారిలో బాలింతలు, పసిపిల్లలు ఉన్న విషయాన్ని మరిచి బుక్కెడు అన్నం పెట్టకుండా చంపేస్తామని బెదిరించారని తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఖమ్మంలో వెలుగు చూశాయని గుర్తుచేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి ప్రభుత్వంపై, జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ కి డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed