నైట్ కర్ఫ్యూలో కమిషనర్ల తనిఖీలు

by  |
నైట్ కర్ఫ్యూలో కమిషనర్ల తనిఖీలు
X

దిశ, క్రైమ్ బ్యూరో : కరోనా నేపథ్యంలో.. రాత్రి పూట కర్ఫ్యూ విధించిన మంగళవారం రాత్రి హైదరాబాద్ నగరంలో పోలీస్ అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో పర్యటించగా, సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ గచ్చిబౌలి చౌరస్తా, మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో 64 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెడికల్ ఎమర్జెన్సీ, గూడ్స్ వెహికల్స్, పెట్రోల్ బంక్ ఇతర ఎమర్జెన్సీ సర్వీస్‌లకు అనుమతులు ఉన్నట్లు తెలిపారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. “నైట్ కర్ఫ్యూ మన భద్రత కోసమే అని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి లాక్ డౌన్ సమయంలో గతేడాది ఎలా సహకరించారో ప్రజలు ఈ కర్ఫ్యూ లోనూ సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. వాక్సిన్ పై అపోహలు వదిలి వాక్సిన్ వేయించుకోవాలన్నారు.



Next Story