కలెక్టర్ వాహనానికి రూల్స్ ఉండవా..?

by  |
కలెక్టర్ వాహనానికి  రూల్స్ ఉండవా..?
X

దిశ, వరంగల్: జిల్లా ప్రథమ పౌరుని స్థానంలో ఉండి, ప్రజలకు రూల్స్ పై అవగాహన కల్పించాల్సిన వారే రూల్స్ ను అతిక్రమిస్తున్నారు. తాజాగా.. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించిన ప్రభుత్వ వాహనం శుక్రవారం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసింది. జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా సెంటర్‌లోని ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్‌‌లో రెడ్ సిగ్నల్ పడి ఉన్నప్పటికి, బస్టాండ్ రూట్ నుండి వస్తున్న కలెక్టర్‌కు సంబంధించిన ప్రభుత్వం వాహనం అక్కడ ఆగకుండానే వెళ్ళింది.

గ్రీన్ సిగ్నల్ పడేందుకు ట్రాఫిక్ సిగ్నల్ టైమర్‌లో ఇంకా 23 సెకన్ల సమయం ఉంది. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఆగాల్సిన కలెక్టర్ ప్రభుత్వ వాహనం, రూల్స్ బ్రేక్ చేయడం పట్ల అక్కడే ఉన్న ప్రయాణికులు ఈ విషయంపై చర్చించుకున్నారు. ఈ వాహనం వస్తుండగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న వాహనాన్ని ఆపాల్సింది పోయి, ఈ వాహనం కోసం రహదారిపై రద్దీ లేకుండా చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Next Story

Most Viewed