ఆ పన్నులు వసూలు చేయండి.. తప్పు చేస్తే చర్యలు తప్పవు..

by  |
ఆ పన్నులు వసూలు చేయండి.. తప్పు చేస్తే చర్యలు తప్పవు..
X

దిశ, చివ్వేంల: తప్పు చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ అన్నారు. గురువారం చివ్వేంల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చివ్వేంల, మోతే మండలాల పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పనుల గురించి మాట్లాడారు. మహాత్మా గాంధీ ఉపాధిహామీ పథకం క్రింద లేబర్ తో ఎక్కువ పనులు చేయించాలని, హరితహారం, నర్సరీలు, వైకుంఠధామం పనులు వెంటనే పూర్తి చేయించాలన్నారు.

సెగ్రిగేషన్ షెడ్లలో కంపోస్టు ఎరువు, గ్రామపంచాయతీ లో ఇంటి పన్ను వసూలు చేయాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల లోపల అందరూ కార్యదర్శులు తప్పనిసరిగా డిఎస్ఆర్ చేయాలన్నారు. మరోసారి 100% ప్రగతి లేకుంటే చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ, సురేష్, డిఆర్డిఓ కిరణ్ కుమార్, ఇంచార్జి డిపిఓ శ్రీరాములు, మండలాల ఎంపీడీఓ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed