వరద ప్రాంతాల్లో అన్నం, 3దుప్పట్లు పంపిణీ

7

దిశ, వెబ్‌డెస్క్: వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి ఆహారం, 3 దుప్పట్లు వెంటనే అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం రూ.5కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించారు. భారీ వర్షాలు, వరద ప్రభావంపై గురువారం అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ పై విధంగా స్పందించారు. వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని, ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇళ్లను మంజూరు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7.35లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు సీఎంకు వివరించిన అధికారులు.. రూ.2వేల కోట్ల నష్టం ఉంటుందని అంచనా వేశారు.