భారత చరిత్రలో పి.వి. నిలిచిపోతారు: సీఎం కేసీఆర్

by  |
భారత చరిత్రలో పి.వి. నిలిచిపోతారు: సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయనను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన రంగాలలో పి.వి. నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారత దేశం అనుభవిస్తున్నదని.. అంతర్గత భద్రత, విదేశాంగ, వ్యవహారాల్లోనూ పి.వి అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్టపరిచిందిని సీఎం కొనియాడారు. బహు భాషా వేత్తగా, బహు ముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పి.వి. కి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని సీఎం గుర్తు చేశారు.


Next Story

Most Viewed