‘సీతమ్మ పాదాల వద్ద నిర్మాణ పనులకు శ్రీకారం’

by  |
‘సీతమ్మ పాదాల వద్ద నిర్మాణ పనులకు శ్రీకారం’
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో 9 ఆలయాలను పునఃనిర్మించేందుకు సీఎం శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్​ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక పర్యాటకంపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. తొలుత కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆంజనేయ శర్మ , వీవీఎల్‌ఎన్ ఘనాపాటి, వెంకటేశ్వర రావు, రామకృష్ణ ఆశీర్వచనాలు అందించారు. దేవాదాయ శాఖ రాష్ట్రంలోని వివిధ ఆలయాలపై రూపొందించిన క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు , బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు పార్ధసారధి, జోగి రమేష్, మేకా ప్రతాప్ వెంకట అప్పారావు, కైలే అనిల్ కుమార్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, కమిషనర్ అర్జున రావు, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ శ్రీనివాసులు పాల్గొన్నారు.


Next Story