గ్రామస్తుల మధ్య ఘర్షణ.. రాముడి ఫ్లెక్సీని చింపిన సర్పంచ్

by  |
Ramudi plexi
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపురం గ్రామంలో శివాలయం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రాముడి ఫ్లెక్సీని గ్రామ సర్పంచ్ గోపని లక్ష్మీ మల్లయ్యతో పాటు అతని అనుచరులు చింపేసి, పందిరిని కూల్చేశారు. ఇటీవల శివాలయంలో ఫంక్షన్ హాల్‌ నిర్మించవద్దని గ్రామ ప్రజలంతా తీర్మాణం చేశారు. అయినా వినకుండా తనకు సంబంధించిన ఓ కాంట్రాక్టర్‌తో సర్పంచ్ ఫంక్షన్ హాల్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలంతా కలిసి పనులను అడ్డుకున్నారు. అనంతరం ప్రజలంతా అక్కడ రాముని గుడి కట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాముని ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేశారు.

ఉగాది సందర్భంగా ఈ రోజు ప్రత్యేక పూజలు చేసేందుకు పందిరిని సైతం నిర్మించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ ఏకపక్షంగా తన అనుచరులతో కలిసి వచ్చి ఫ్లెక్సీని, పందిరిని కూల్చేశారు. దీంతో సర్పంచ్ వర్గానికి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంకటాపూర్ చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు పోలీసులు సర్పంచ్‌కు మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ ఫ్లెక్సీ ఎవరు పెట్టారంటూ రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, ప్లెక్సీ పెట్టిన వారిపై కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగాడు. దీంతో వివాదం మరింత ముదరడంతో ఏసీపీ రామేశ్వర్ అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సముదాయించి, అక్కడినుంచి పంపిచారు.



Next Story

Most Viewed