జీహెచ్ఎంసీ అలసత్వం.. దిమ్మతిరిగే షాకిచ్చిన నగర పౌరుడు

by  |
జీహెచ్ఎంసీ అలసత్వం.. దిమ్మతిరిగే షాకిచ్చిన నగర పౌరుడు
X

దిశ, సిటీబ్యూరో : పౌర సేవలతో పాటు వివిధ రకాల ఫిర్యాదులతో బల్దియా ప్రధాన కార్యాలయానికి వచ్చే నగర వాసులను కనీసం పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. గురువారం ప్రధాన కార్యాలయానికి వచ్చిన హుమాయున్ నగర్ ప్రాంతానికి చెందిన నసిరుల్లా హసన్ జహీద్ తన ఇంటిని అధికారులు అన్యాయంగా కూల్చారని ఫిర్యాదుల చేసేందుకు కమిషనర్‌ లోకేశ్ కుమార్‌ను కలిసేందుకు వచ్చారు. సందర్శన వేళలైన మధ్యాహ్నాం3 గంటలకు వచ్చిన ఆయనకు ఎవరూ సమాధానం చెప్పకపోవటంతో సహనం నశించిన ఆయన సాయంత్రం 6 గంటలకు ప్రధాన కార్యాలయంలోకి వచ్చిన కమిషనర్ కారుకు అడ్డంగా బైఠాయించారు.

హుమాయున్ నగర్‌లో తాము కట్టుకుంటున్న తమ ఇంటి నిర్మాణానికి టీఎస్ బీపాస్ ద్వారా అనుమతి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నామని, ఈ నిర్మాణంపై హైకోర్ట్ స్టేటస్ కో కూడా ఉన్నా, అధికారులు పూర్తిగా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ముందస్తు సమాచారం గానీ, నోటీసులు గానీ ఇవ్వకుండా కూల్చేశారని వాపోయారు. టీఎస్ బీ పాస్ నియమావళి ప్రకారం 21 రోజుల్లో మీరు అనుమతివ్వకపోతే అనుమతి వచ్చినట్టే భావించి, నిర్మాణాలు జరుపుకోవచ్చునన్న నిబంధన ఉన్నా.. ఎందుకు కూల్చారని ప్రశ్నించారు.పైగా బీ పాస్‌లో తమ అప్లికేషన్ రిజెక్ట్ చేయకపోవడంతో తాము నిర్మాణం ప్రారంభించామని స్పష్టం చేశారు. ఎంత చెప్పినా జహీద్ విన్పించుకోకపోవటంతో సెక్యూరిటీ, పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ను అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.



Next Story

Most Viewed