- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.. బాలకృష్ణ లైనప్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
నందమూరి బాలకృష్ణ రెండు, మూడు సినిమాలు లైన్‌లో పెట్టారు.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా.. బాలయ్య మరో రెండు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టినట్లు టాక్. ఇప్పటికే టాలీవుడ్ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్. అయితే.. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోగా.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుపై ఊహాగణాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్‌లో, దర్శకుడు విజయ్ కనకమేడలతో మరో సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశముండగా, అధికారిక ప్రకటన త్వరలో రానుందని ఫిలిమ్ వర్గాల నుంచి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. అనౌన్స్‌మెంట్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






