- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాలీవుడ్ హీరోలతో నాని! నెక్ట్స్ ప్రాజెక్టుల ప్లానింగ్ మామూలుగా లేదుగా!
నాని తన వాల్ పోస్టర్ బ్యానర్‌పై తెరకెక్కించే తదుపరి చిత్రాలకు మాలీవుడ్ హీరోలను లైన్లో పెట్టాడట.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూనే.. సమర్పకుడిగా కూడా చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ హీరో సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై వచ్చిన ‘కోర్టు’ సినిమా సంచలన హిట్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి చిత్రంతోనే హాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ఇప్పుడు తన తదపరి సినిమాల కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు.. తన వాల్ పోస్టర్ బ్యానర్‌పై తెరకెక్కించే తదుపరి చిత్రాలకు మాలీవుడ్ హీరోలను లైన్లో పెట్టాడట. ఓ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ హీరోగా నటిస్తుండా.. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడని, మరో చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా, ‘కోర్ట్’ ఫేమ్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించనున్నాడని టాక్. ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సినిమాలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






