TovinoThomas: NTRNeel ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న మలయాళ స్టార్.. ఎందుకంటే?

by Chukka Sudharani |

ఒక సినిమాను ఒక ఏడాది మాత్రమే చేస్తాను.. అంతకు మించి డేట్స్ ఇవ్వలేను అంటున్నాడు మలయాళ స్టార్ హీరో టొవినో థామస్.

TovinoThomas: NTRNeel ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న మలయాళ స్టార్.. ఎందుకంటే?
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ కాగా.. ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించగా.. షాకింగ్ కామెంట్స్ చేశారు టొవినో థామస్. ‘నేను ఒకే సమయంలో ఒక సినిమా మాత్రమే చేయాలనే సూత్రాన్ని పాటిస్తాను. అలాగే ఒకే సినిమా కోసం ఏడాదికి మించి సమయం కేటాయించలేను. ఒక సినిమా షెడ్యూల్ నుండి మరొక సినిమా షెడ్యూల్‌కు మారుతూ పనిచేయడం నాకు సాధ్యం కాదు.. అందుకే నేను ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయడం లేదు. నేను నా మలయాళ సినిమాలను మాత్రమే కొనసాగిస్తాను’ అని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ నుంచి టొవినో థామస్ తప్పుకున్నట్లు క్లారిటీ వచ్చింది.

Next Story