హిందీ రియాలిటీ షో కంటెస్టెంట్‌గా మంచు లక్ష్మి.. ఆ అవతారం ఏందో.. అ కథేందో.. తెలుగోళ్ల పరువు తీస్తుందిగా.. (VIDEO)

by Sujitha Rachapalli |

కరణ్ జోహార్ హోస్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఇండియన్ వెర్షన్ ‘ది ట్రైటర్స్’ రియాలిటీ షో పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. హిందీ టెలివిజన్‌కు చెందిన నటీనటులు

హిందీ రియాలిటీ షో కంటెస్టెంట్‌గా మంచు లక్ష్మి.. ఆ అవతారం ఏందో.. అ కథేందో.. తెలుగోళ్ల పరువు తీస్తుందిగా.. (VIDEO)
X

దిశ, ఫీచర్స్ : కరణ్ జోహార్ హోస్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఇండియన్ వెర్షన్ ‘ది ట్రైటర్స్’ రియాలిటీ షో పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. హిందీ టెలివిజన్‌కు చెందిన నటీనటులు, ఉల్లు ప్లాట్ ఫామ్ బోల్డ్ స్టార్స్ ఇందులో పాల్గొంటున్నారు. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఇందులో కంటెస్టెంట్‌గా కనిపించడం విశేషం. తాజాగా ఈమె ఎంట్రీకి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ కాగా అదే రోజు అపోజిట్ గ్రూప్‌కు చెందిన కంటెస్టెంట్‌తో గొడవపడింది. రామాయణంలో రాముడు.. నీటిలో చూస్తూ పైన ఉన్న చేపను విల్లుతో కొట్టాడని వాదనకు దిగింది. ఇది కాస్త వైరల్ కావడంతో పరువు పోయింది.

అసలు ఏం మాట్లాడుతుంది? ఎవరు ఈమె? అంటూ నార్త్ ఇండియన్స్ ఇందుకు సంబంధించిన క్లిపింగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మహాభారత కథను రామాయణంగా మార్చేసిందిగా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ తర్వాత ఆమె సారీ చెప్పిందని.. నాన్న చూస్తే తిడుతాడని కూడా బాధపడిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ తెలుగోళ్లు మాత్రం ఆ అవతారం ఏంది? ఆ కథేంది? పరువు తీస్తుంది? అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఈ విధంగానైనా పాపులారిటీ వస్తుందేమో చూడాలి అని కామెంట్ చేస్తున్నారు.

VIDEO

Next Story